మార్కాపురం జిల్లా ఆక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు ఆర్టీసి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని శ్రీశైలం దేవస్థానం వరకు పొడిగించాలని కోరుతూ ఏపి యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ )జిల్లా కమిటీ అధ్యక్షులు ఎన్ వి రమణ సోమవారం సాయంత్రం విజయవాడలోని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రమైన మార్కాపురం పట్టణం నుండి శ్రీశైలం దేవస్థానం 80 కిలోమీటర్ల దూరం ఉండగా, అందులో 72 కిలోమీటర్ల దూరం వరకు మార్కాపురం జిల్లా పరిధిలో వుందని, కావున ఆ కొద్దిపాటి దూరాన్ని దృష్టిలో ఉంచుకొని బస్ పాస్ సౌకర్యాన్ని శ్రీశైలం కు పొడిగించాలని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానందరెడ్డి గారిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ వి. రమణ తెలిపారు.

