వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం జరిగింది -ఘనంగా 32వ ఎం.ఆర్. పి.ఎస్.ఆవిర్భావ దినోత్సవం

నాగులుప్పలపాడు జులై 7,ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సిద్ధించిందని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గద్దె త్యాగరాజు అన్నారు. మంగళవారం ఉప్పుగుండూరులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి 32 సంవత్సరాలు పూర్తి సందర్భంగా ఆవిర్భావ వేడుకలు గ్రామ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వం ద్వారా 32 ఏళ్ల క్రితం ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సామాజిక న్యాయం దిశగా పోరాటం సాగిచ్చిందన్నారు దీని ఫలితం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు మద్దతు తెలుపటంతో సుదీర్ఘమైన పోరాటం మాదిగ మాదిగ ఉపకులాలకు ఇవ్వడం జరిగిందన్నారు. తొలుత స్టేషన్ రోడ్ లోని అంబేద్కర్ , జగజ్జీవన్ రావ్ విగ్రహల వద్ద ఎమ్మార్పీఎస్ జెండా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అనంతరం లైబ్రరీ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరొక ఎమ్మార్పీఎస్ జెండా ఎగురు వేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ కొలకలూరు ఆలీబాబు, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గద్దెశేషయ్య, టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాసరావు, కొప్పర్తి నాగయ్య,పాలపర్తి ప్రసాద్, గురజాల పౌల్, ఏపీఎం కొలకలూరు రవీంద్ర,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొలకలూరి.విజయ్ కుమార్, బండారు సురేష్, కొలకలూరు బాలాజీ రావు, గంగవరపు ఇసాక్, కత్తి నాగార్జున,జెన్ జి యూత్ కొలకలూరి రాము, నిరీక్షణ, కత్తి సురేష్, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *