
విద్యార్థుల భద్రతపై బడి బన్సు డ్రైవర్లు, కేర్ టేకర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని తాళ్లూరు ఎస్పై మల్లిఖార్జున రావు కోరారు. తాళ్లూరులో గురువారం ఎబీసీ హైస్కూల్ పాఠశాల బస్సులను తనిఖీ నిర్వహించారు. బన్సులలో ఫస్ట్ ఎయిడ్స్ బాక్స్, సిలిండర్ కిట్స్, అత్యవసర ద్వారాలను తనిఖీ నిర్వహించారు. అత్యవసర ద్వారం వద్ద అవగాహన కలిగిన విద్యార్థులను మాత్రమే కూర్చినేలా కేర్ టేకర్ జాగ్రత్త వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి చిన్నారులే ఆధారంగా వారిని ఎంతో చక్కగా చదివిస్తున్నారని వారి భవిష్యత్ మీ చేతుల్లో ఉంటుందని తగిన అప్రమత్తతతో వ్యహరిస్తే ప్రమాదాలకు దూరంగా ఉండవచ్చని పలు నూచనలు చేసారు. బన్సు ఫిట్ నెన్, ట్యాక్స్, ఫర్మిషన్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ లు పరిశీలించారు. అన్ని వివరాలను సేకరించి పోలీస్ స్టేషన్లో భద్రపరచాలని సీపీ అంజి బాబు కు సూచించారు.


అనంతరం సాయత్రం విజిబుల్ పోలిసింగ్లో బాగంగా కూలీల నాలుగు చక్రాల బండిలో అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్న మహిళా కూలీలకు కౌల్సిలింగ్ నిర్వహించారు. జీవితం చాలా విలువైనదని, ప్రమాదాలు జరిగితే కుటుంబాలు నష్టపోయి విచ్చిన్నమైన సంఘటనలు వివరించారు. డ్రైవర్ కు కౌల్సిలింగ్ ఇచ్చారు.
