ఎస్సీ, ఎస్టీలకు అంది స్తున్న ఉచిత విద్యుత్తు సదుపాయాన్ని వినియోగించుకోవాలని దర్శి ఏపీ సీపీడీసీఎల్ ఈఈ పాలగిరి శ్రీనివాసులు తెలి పారు. తాళ్లూరు మండలంలోని వెలుగువారిపాలెంలో విద్యుత్తు సరఫరా తీరును మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. గ్రామాలకు నిరంతర విద్యుత్తు సరఫరా జరిగేలా చూడాలన్నారు. తదుపరి అక్కడి ఎస్సీ కాలనీలో విద్యుత్తు వినియోగదారులతో మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు వాడుతున్న వారు మీటర్ల కు దరఖాస్తు చేసుకుని వాటిని ఉపయోగించుకుని ఉచితంగానే విద్యుత్ ను తీసుకోవచ్చన్నారు. అక్రమంగా వినియోగిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుం దన్నారు.
కుల ధ్రువీక రణ పత్రంతోపాటు ఆధార్, చరవాణి వివరాలను సమర్పించి కొత్త సర్వీసులు పొందొచ్చ న్నారు. అనంతరం అనధికారికంగా విద్యుత్తును వినియోగిస్తున్న పలువురి సర్వీస్ వైర్లను తొలగించారు. కార్యక్రమంలో ఏఈ రామకృ ష్ణారెడ్డి, ఎల్. ఐ
కాంతా రావు, తదితరులు పాల్గొన్నారు.
