గాంధీ నూతన వైస్ ప్రిన్సిపాల్ గా నాగమోహనరావు

సికింద్రాబాద్, జూలై 14 (జే ఎస్ డి ఎం న్యూస్ ) ::సికింద్రాబాద్ గాంధీ మెడికల్‌ కాలేజీ నూతన వైస్‌ప్రిన్సిపాల్‌గా ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ బీవీ నాగమోహనరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న ప్రొ. రవిశేఖరరావు బదిలీ కావడంతో ఆయన స్థానంలో నాగమోహనరావును నియమిస్తూ ప్రిన్సిపాల్‌ ప్రొ. ఇందిర మంగళవారం ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా నూతన వైస్‌ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. కళాశాలలోని సుమారు రెండు వేల మంది ఎంబీబీఎస్, పీజీ, పారామెడికల్‌ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, అకడమిక్‌ పరంగా తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రిన్సిపాల్‌ ప్రొ. ఇందిరకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ వైస్‌ప్రిన్సిపాల్స్‌ ప్రొ. చంద్రశేఖర్, ప్రొ. రాజారామ్, క్రిటికల్‌ కేర్‌ హెచ్‌ఓడీ ప్రొ. కిరణ్‌మాదల తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *