తాళ్లూరు మండలం విఠలాపురం పంచాయితీ కార్యదర్శి గా ఐవీ రమణా రెడ్డిని నియమిస్తూ మండల
పరిషత్ అభివృద్ధి అధికారి అజిత గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. విఠలాపురం గ్రేడ్ -4 కార్యదర్శిగా పనిచేస్తున్న షేక్ షహనాజ్ బేగంని పదోన్నతిపై గ్రేడ్ -3గా శివరామపురం గ్రామ పంచాయితీకి బదిలీ చేసారు. విఠలాపురం అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న షేక్ షహనాజ్ బేగం పై స్పందనలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు వచ్చాయి. అందువలన ఆమెను ఆ బాధ్యతల నుండి తప్పించి ఐవీ రమణా రెడ్డిని పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించాలని ఎంపీడీఓ ఆదేశాల జారీ చేసారు.
విఠలాపురం పంచాయితీ ఇన్చార్జి కార్యదర్శిగా ఐవీ రమణా రెడ్డి
16
Jul