జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారిని ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్ధ ప్రసాదాలు, ఆశీర్వాదం అందించారు. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ సానే సురేష్ ఈఓ నర్రా నారాయణ రెడ్డి, ఆర్ ఏ ప్రసాద్ భక్తులకు కావలసిన సౌకర్యాలను పర్యవేక్షించారు. గుంటి గంగా భవాని ఆలయ అన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించారు.

గంగా పార్వతి సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి బ్రహ్మ సూత్రం దేవస్థానంలో శాంతి హెూమం నిర్వహించారు. బెల్లంకొండ శివ ప్రసాద్ శర్మ, ప్రభాకర్ శర్మ, రాజశేఖర్ శర్మ సుబ్బా రావు శర్మలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.