దర్శి యువ కళాకారుడికి అరుదైన గౌరవం-ఆల్ ఇండియా రేడియో ‘బి-గ్రేడ్’ నాదస్వర ఆర్టిస్టుగా గోనుగుంట నాగరాజు ఎంపిక





ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గోనుగుంట నాగరాజు ప్రతిష్ఠాత్మకమైన ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి) లో నాదస్వర విభాగం బి-గ్రేడ్ ఆర్టిస్టుగా ఎంపికయ్యారు. 2024లో నిర్వహించిన ఆల్ ఇండియా రేడియో ఆడిషన్‌లో ప్రతిభ కనబరిచి ఈ అరుదైన గుర్తింపు పొందారు.  దర్శి ప్రాంతం నుండి నాదస్వర విభాగంలో ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా గోనుగుంట నాగరాజుకు పలువురు  బంధువులు, స్నేహితులు, గ్రామస్థులు, సంగీతాభిమానులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *