అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు -పేకాట ఆడుతున్న స్థావరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పదిమంది అరెస్ట్, రూ.9580/- నగదు స్వాధీనం

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రకాశం జిల్లా కొత్తపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈతముక్కల మరియు మడనూరు గ్రామల శివారులో ఆదివారం సాయంత్రం సమయంలో పేకాట స్ధావరంపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ CI కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై K మరిది నాయుడు మరియు వారి సిబ్బంది ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ.9580/- నగదు, 10 మొబైల్ ఫోన్లు మరియు 3 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు నిమిత్తం కొత్తపట్నం పోలీస్ స్టేషన్లో టాస్క్ఫోర్స్ పోలీసులు అప్పగించడం అయినది .

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *