తెలంగాణా బోనాల విశిష్టతను విశ్వ వ్యాప్తం చేసిన ఘనత కే సి ఆర్ కే దక్కుతుంది……శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం వద్ద ఎంతో అభివృద్ధి చేశాం.అందరి సహకారంతో ఆషాఢ బోనాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తాం…సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని.

బేగంపేట జులై 19 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాలవిశిష్టతను విశ్వవ్యాప్తం చేసిన ఘనత
కే సీ ఆర్ ప్ర భుత్వానికే దక్కుతుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు సేవలు అందించే దక్కన్ మానవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి తలసాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బోనాలఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే ఆలోచనతో ప్రయివేటు దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందించిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు. ఇందుకోసం 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని, అందుకు అనుగుణంగా తమ ప్రభుత్వ హయాంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు. అమ్మవారి ఆలయాన్ని, పరిసరాలను ఎంతో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆషాఢ బోనాలను రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో ఘనంగా నిర్వహించుకుందామనిపిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం అమ్మవారి కి బోనం సమర్పించేందుకు వచ్చే భక్తులకు దక్కన్ మానవ సేవా సమితి, నల్లగుట్ట అభివృద్ధి సంఘం, మున్నూరు కాపు సంఘం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తదితర సంస్థలు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. వచ్చే నెల 2 వ తేదీన జరిగే అమ్మవారి జాతర కు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పిల్లి శ్రీనివాస్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, రఘు మోహన్, మాశెట్టి శ్రీనివాస్, కమల్ కుమార్, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, నాగులు, కోటేశ్వర్ గౌడ్, సతీష్, గణేష్, కొండాపురం మహేష్ యాదవ్, ఆనంద్ పాటిల్, అరుణ్ భట్, జయరాజ్, ధరం చౌదరి, సత్యనారాయణ, మధు ముదిరాజ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
దక్కన్ మానవ సేవాసమితి అధ్యక్షునిగా తలసాని ఏకగ్రీవ ఎన్నిక.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దక్కన్ మానవ సేవా సమితి సేవలను మరింత విస్తృతం చేసేలా వినూత్న కార్యక్రమాలు చేపడతామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దక్కన్ మానవ సేవా సమితి ని స్థాపించి 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100 వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో శతాబ్ది కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున జంతుబలులు జరుగుతున్న తరుణంలో దక్కన్ మానవ సేవా సమితి ని 1926 సంవత్సరంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా నాటినుండి భక్తులకు అద్భుతమైన సేవలు అందిస్తూ వస్తున్నట్లు వివరించారు. ఎంతో చరిత్ర కలిగిన సమితి కి అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు అభినందనలు తెలిపారు. సమితి సభ్యులే కాకుండా సమావేశానికి హాజరైన పలువురు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. తమకు అనేక సంవత్సరాలుగా అండగా ఉంటూ మా సేవా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షుడు కావడం పట్ల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

తలసానిని సత్కరించిన శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్.
దక్కన్ మానవ సేవ సమితి నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శ్రీ ఉజ్జయిని మహాకాళి ఆలయం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ సురిటి కామేశ్వర్ శాలువా పూల దండతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.రామ్ గోపాల్ పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ ,బి ఆర్ ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్,పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పౌరులు తలసానిని శాలువాలు ,పూల దండలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *