సికింద్రాబాద్ జులై 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాడ జాతర బోనాల పండుగ వేడుకలు ఆదివారం ఘటోత్సవంతో ఘనంగాప్రారంభమయ్యాయి.ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు నిర్వహించే అమ్మవారి ఘటం అలంకరణకు సంబంధించిన విశేష సామాగ్రినిఅందజేశారు. దేవాదాయ శాఖ అడిషనల్
కమిషనర్ కె. జ్యోతి, ఆలయ కార్యనిర్వహణాధికారి గుత్తా మనోహర్ రెడ్డి సంయుక్తంగా
ఈ అలంకరణ సామాగ్రిని ఆలయ ప్రధాన అర్చకులకు, ధర్మకర్తలకు,దేవస్థాన ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్‌కు శాస్త్రోక్తంగా అందజేశారు. ప్రత్యేక అలంకరణాలతో అమ్మవారి ఘటం ఆదివారం మద్యాహ్నం ప్రధాన ఆలయం నుంచి మేళాతాళాలు,పోతరాజుల నృత్యాలతో ప్రారంభమై కర్బల మైదానంలోని అమ్మవారి ఆలయానికి చేరుకుంది.రాత్రి తిరిగి అమ్మవారి ఘటం అక్కడి నుంచి ఊరేగింపుగా బయలు దేరి తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక వర్గ సభ్యులు, సిబ్బందితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లష్కర్ బోనాల ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభ తో నిండిపోయాయి.



