తాళ్లూరు వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి మాగంటి శ్రీ హర్షిణి (975/1000) ఈఈటీ ఓకేషన్ కోర్సులో ప్రతిభ చాటి షైనింగ్ అవార్డు పొందినది. ఈ అవార్డు సోమవారం ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజా బాబు, డీఐఈఓ కె అంజనేయులు చేతుల మీదుగా అందుకున్నారు. ప్రొత్సహకంగా రూ. 20వేలు నగదు, గోల్డ్ మెడల్ అందించారు. అవార్డు అందుకున్న ఆమెకు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వేణు గోపాల్, లెక్చరర్ లక్ష్మయ్య, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.


