సూపర్ ఎల్ నినో ప్రభావంతో భూ గర్భజలాలు అడుగంటినప్పుడు తక్కువ నీటితో పండే రకాలను రైతులు ఎంపిక చేసుకుని ఖరీఫ్‌లో సాగు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండలంలో విఠలాపురం, కొత్త పాలెం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. తక్కువ వర్షపాతంతో పండే రకాలైన జొన్నలు, కంది, జూట్, కొర్ర, మునుములు, పెనరలలో రకాలను వివరించారు. విఏఏ అశోక్, వెంకట రాజా, రాజేష్, రాధా క్రిష్ణ, ఎఈఓ సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

