మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి, 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.6000/-వేలు జరిమానా విధించిన గౌరవ POCSO కోర్టు జడ్జి -పోక్సో కేసులో నిందితుడుకు శిక్ష పడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ -పిల్లలు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారిని చట్టం నుండి తప్పించుకునే వీలు లేదు

మార్కాపురం జిల్లా హెచ్‌.ఎం.పాడు గ్రామం & మండలానికి చెందిన 13 సంవత్సరాల మైనర్ బాలికను, కనిగిరి మండలం నేలటూరు గ్రామానికి చెందిన గురునాధం దానియేల్ (31 సం.) అనే వ్యక్తి, ఫిర్యాదుదారునికి బంధువు కావడంతో ఆయన ఇంటిలోనే కొంతకాలంగా ఉంటూ, ఫిర్యాదుదారుని పెద్ద కుమార్తెను నమ్మించి తన భార్య చనిపోయిందని, తనను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మబలికి, బాధితురాలి కుటుంబ సభ్యులు ఇంటిలో లేని సమయంలో తేది: 22.10.2023 న సుమారు రాత్రి 08.00 గంటలకు బాధితురాలిని ఎన్‌. గొల్లపల్లి గ్రామం తీసుకెళ్లి, బాధితురాలు సమ్మతి లేకుండా బలవంతంగా పలుమార్లు శారీరకంగా అత్యాచారానికి పాల్పడినాడు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హెచ్‌.ఎం.పాడు పోలీసులకు పిర్యాది తన కుమార్తె కనిపించడం లేదని పిర్యాది చేయగా సదరు విషయం తీసుకున్న ముద్దాయి తేది: 28.10.2023 ఉదయం బాధితురాలిని హెచ్‌.ఎం.పాడు గ్రామ శివారులో వదిలివెళ్లిపోయినాడు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా, అప్పటికే గర్ల్ మిస్సింగ్ కేసును హెచ్‌.ఎం.పాడు ఎస్సై పి. శివనాగరాజు నమోదు చేసి దర్యాప్తు జరుపుతూ ఉండగా, అనంతరం బాధితురాలి స్టేట్మెంట్ మేరకు సంబంధిత సెక్షన్లు ఆల్టర్ చేసినారు. అప్పటి డీఎస్పీ ఆర్‌.రామరాజు గారు దర్యాప్తు చేసి, ముద్దాయిని అరెస్టు చేసి, కేసును విచారించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.

పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిండుతునిపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 22.07.2026న బుధవారం గౌరవ POCSO కోర్ట్ జడ్జి శ్రీ కె.శైలజ గారు ముద్దాయి కి 20 సంవత్సరాలు జైలు శిక్ష రూ.6000/-.వేల రూపాయలు జరిమానా జరిమానా, భాధితురాలకు నష్టపరిహారం రెండు లక్షల రూపాయలు ఒంగోలు DLSA ద్వారా అందచేయవలసిందిగా ప్రకటించారు.

పై కేసులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన అప్పటి కనిగిరి DSP R. రామరాజు, అప్పటి కనిగిరి SI శివనాగరాజు,Spl PP గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజెన్ ASI.E.V స్వామి, PC యల్లమంద, కనిగిరి సెషన్స్ కోర్టు HC.ఇమామ్ హుసేన్ అధికారులను మరియు సిబ్బందిని మార్కాపురం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *