ఆషాడ మాసం సందర్భంగా తాళ్లూరులో ఆర్యవైశ్యమహిళలు గ్రామంలోని కన్య కాపరమేశ్వరి అమ్మ వారికి శుక్రవారం ఆ షాడ సారె సమర్పించారు. మహిళలు అమ్మవారికి పసుపు,కుంకుమ, గాజులు, చీర, తాంబూలం, పిండి వంటలతో కూడిన కానుకలను తీసుకుని గ్రామవీధుల్లో భాజా భజంత్రీలతో గ్రామోత్సవంగా వెళ్లి, మార్గమద్యంలో గల గ్రామదేవతలకు కూడా ఆషాడ సారె సమర్పించి కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు చేరుకున్నారు. ఆర్యవైశ్యహహిళలు కన్యకా పరమే శ్వరి అమ్మవారిని తమ ఇంటిఆడ పడుచుగా భావించి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి. ఆషాడ సారె సమర్పించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు చందో లు ఆంజనేయులు, ఛందోలు రామారావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
