మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి, ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించిన గౌరవ పోక్సో (POCSO) కోర్టు న్యాయమూర్తి

ప్రకాశం జిల్లా, అద్దంకి మండలం, బత్తులవారిపాలెంకు చెందిన షేక్ సమీర్ (20 సం.) అనే వ్యక్తి, తేదీ: 08.10.2023న సాయంత్రం 6:00 గంటల సమయంలో బాధితురాలు (14 సం.)తన ఇంటికి సమీపంలోని షాపు వద్దకు వెళ్లిన సమయంలో,నిందితుడు బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతంగా మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లి, బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో, బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో అప్పటి WSI ప్రవీణ కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ కేసును అప్పటి అద్దంకి సీఐ బి. రమేష్ బాబు కి అప్పగించగా, ఆయన కేసును దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్టు చేసి, కోర్టు లో చార్జీ షీట్ దాఖలు చేసినారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిండుతునిపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 29.07.2026న బుధవారం గౌరవ POCSO కోర్ట్ జడ్జి కె.శైలజ ముద్దాయి కి .3 సంవత్సరాలు జైలు శిక్ష రూ. ఐదు వేల రూపాయలు జరిమానా, భాధితురాలకు నష్టపరిహారంగా 4,000/- రూపాయలు అందచేయవలసిందిగా ప్రకటించారు.

పై కేసులో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన అప్పటి అద్దంకి CI B. రమేష్ బాబు, WSI ప్రవీణ,Spl PP గొట్టిపాటి శ్రీనివాసరావు, కోర్టు లైజెన్ ASI.E.V స్వామి, PC యల్లమంద, అద్దంకి సెషన్స్ కోర్టు ASI 1784 D.సైదయ్య ప్రస్తుతం అధికారులను మరియు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *