దర్శి నియోజకవర్గ బీజేపీ సంస్థాగత సమావేశం మంగళవారం దర్శి పట్టణంలోని అభి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రకాశం జిల్లా ఇన్చార్జి గుల్లపల్లి భరత్ మాట్లాడుతూ .. …..రాబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బూత్ లెవెల్ ఏజెంట్లు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఓటర్ జాబితా పరిశీలన ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్‌తో సమన్వయం చేసుకొని తమ బూత్ పరిధిలోని ఓట్ల జాబితాలోని అవకతవకలు సరిదిద్దుకోవాలి. భారతీయ జనతా పార్టీ బీఎల్ఏ ఏజెంట్లు గ్రౌండ్ లెవెల్లో బలంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, మాజీ జిల్లా అధ్యక్షులు, లేబర్ బోర్డు వెల్ఫేర్ డైరెక్టర్ పివి శివారెడ్డి , బీఎల్ఏ-1 పోకట్ల నాగేశ్వరావు, సర్ జిల్లా కన్వీనర్ దండు శ్రీనివాసులు , ఏపీ రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ మాడపాకుల శ్రీనివాసులు , పల్నాడు జిల్లా ఇన్చార్జి జి. తోగంటి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు రవి తో పాటు నియోజకవర్గ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
దర్శి రూరల్ కాకర్ల నాగసాయి, దర్శి పట్టణం వల్లభవర అమరేశ్వరరావు, కురిచేడు కోరంగి నాగేశ్వరరావు, మందలపు శేషయ్య దొనకొండ మునయ్య యాదవ్ మరియు దర్శి నియోజకవర్గ బూత్ ఏజెంట్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
