ఆషాడ మాస గురుపౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి బుధవారం లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.ఉదయం బిందెతీర్థం ,గోపూజ, అభిషేకం ,తదుపరి అలంకారంతో స్వామివారి దర్శన భాగ్యం భక్తులకు కల్పించారు. ఆలయ వేద పండితులు లక్ష తమలపాకులతో అత్యంత వైభవంగా పూజ జరిపించారు. దేవస్థానం ట్రస్టు బోర్లు చైర్మన్ చుండూరి మురళి సుధాకర్, పాలకమండలి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు .
