దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ జన్మదిన వేడుకలను సోమవారం దర్శిలో మద్దిశెట్టి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, మద్దిశెట్టి రవీంద్ర, మద్దిశెట్టి వాసు హాజరై అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా చలివేంద్రం కొండ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కాశీనాయన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తదుపరి సాయిబాబా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వృద్ధులకు భోజనాలు వడ్డించారు.
ఈ వేడుకల్లో మద్దిశెట్టి కుటుంబ సభ్యులు, అభిమానులు, యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


