డీఎస్సీలో అవకతవకలపై ఎందుకు మాట్లాడరు -పోలీసులను అడ్డు పెట్టుకుని దీక్షలకు భంగం -ఉద్యోగాలు కావాలంటే జగనన్న సీఎం కావాలి – లక్షకుపైగా సచివాలయాలు ఇచ్చిన ఘనత జగనన్నదే-దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి

ఏ తప్పూ చేయకుంటే సీబీఐ అంటే వెన్నులో ఎందుకు వణుకు పుడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. డీఎస్సీలో అవకతవ కలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ రెండో రోజు నిరాహార దీక్ష స్థానిక వై సీపీ కార్యాలయం లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి
తో పాటు తాళ్లూరు మండల వై సీపీ నాయకులు నిరాహార దీక్షలో కూర్చొన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత వారికి నిమ్మరసం ఇచ్చి బూచేపల్లి వెంకాయమ్మ నిరాహార దీక్ష విర మింప జేశారు. లోకేష్ రాజీనామా చేయాలంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. 200 మందికి పైగా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసా ద్రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో అవక తవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మం త్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అవినీతి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి అర్హులకు న్యాయం చేయాలని కోరారు. తప్పు చేసిన తండ్రీకొడుకులు స్కామ్ ఎక్కడ బయట పడుతుందోనని పోలీసు లను అడ్డు పెట్టి ప్రశాంతంగా చేస్తున్న దీక్షలను భగ్నం చేసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా తప్పు చేయకుంటే ఎందుకు భయపడు తున్నారని ప్రశ్నించారు. నిజాయితీపరులైతే వెంటనే సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నిరుద్యోగులకు మొండిచేయి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు
గడుస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికి 25 నెలలకు 75 వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షకుపైగా సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిస్పక్ష పాతంగా ఉద్యోగాలిచ్చిన ఘనత దక్కించుకున్నారని గుర్తు చేశారు. భవిష్యత్లో యువతకు ఎప్పుడు ఉద్యోగాలు రావాలన్నా జగ నన్న సీఎం కావాలని స్పష్టం చేశారు. ఆగష్టు 10వ తేదీన జరిగే ర్యాలీలో నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, నాయ కులు, నిరుద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే బూచేపల్లి కోరారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు మండలాల పార్టీ అధ్యక్షులు వెన్నపూస వెంకటరెడ్డి, తూము వెంకట సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధు సూధన్ రెడ్డి, రాష్ట్ర మేదావుల సంఘ ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారెడ్డి,
వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము తిరుపతిరెడ్డి, లీగల్సేల్ జిల్లా కార్యదర్శి గోపు శ్రీనివాస్ రెడ్డి,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, వైస్ ఎం పీపీ సోము దుర్గారెడ్డి, మాజీ జెడ్పీటీసీ లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నియోజకవర్గ పబ్లిసిటీ వింగ్ అధ్య క్షుడు యత్తపు మధుసూదన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు
పులి ప్రసాద్ రెడ్డి, జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గోపు శ్రీనివాసరెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, మండల స్టూ డెంట్ వింగ్ అధ్యక్షుడు కైపు అశోక్ రెడ్డి మహిళా సంఘ నియోజకవర్గ అధ్యక్షురాలు నాగలక్ష్మి, క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య , మేడగం చెన్నారెడ్డి, వైఎస్సార్ టీఏ మండల అధ్య క్షుడు వై.సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ లు సంఘ అధ్యక్షుడు, జిల్లా సెక్రెటరీ మారం ఇంద్రసేనారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు గువ్వల శ్రీనివాసరెడ్డి, పద్మ శాలీల సంఘ మండల అధ్యక్షులు నారాయణ సెట్టెయ్య, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మాజీ సర్పంచ్ లు చిమటా సుబ్బారావు, మంద శ్యాంసన్, పులి కృష్ణారెడ్డి, ముచ్చుమారి బ్రహ్మారెడ్డి, నుసుం సుబ్బారెడ్డి, నాయకులు కోరె సుబ్బారావు, శ్యాంసన్, సుబ్బారెడ్డి, సోము అనీల్ రెడ్డి, గుజ్జుల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, సంగు కొండారెడ్డి, పసుపులేటి మణికంఠ, పాలం శ్రీనివాసరెడ్డి, కైపు కోటిరెడ్డి, సూర చిన్నసుబ్బారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి. గుజ్జుల కృష్ణారెడ్డి, అంబటి నాగార్జునరెడ్డి, సూర చిన్నసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *