ఛాతీ, టీబీ పరీక్షలు చేయించుకోవాలని తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ లు కోరారు.తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాగం బొట్లపాలెం, బొద్దికూరపాడు గ్రామాల్లో వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ రెండు వారాలకుపైగా జ్వరం, దగ్గు, బరువు తగ్గ టం వంటి లక్షణాల ఉన్న వారు వెంటనే వైద్యశా లకు వచ్చి పరీక్షలు చేయించుకుని చికిత్స పొం దాలని కోరారు. 200 మందికి పరీక్షలు చేసినట్లు
తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఐవో చంద్రశేఖర్ బాబు, ఎన్టీఎస్ సాయి ప్రసాద్, భవ్య, ఎఫ్సీ మణికంఠ పాల్గొన్నారు.
