తాళ్లూరు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరి
ధిలో సోమవారం నిర్వహించిన కంటి వైద్య పరీక్షల కార్యక్రమంలో శుక్లం (క్యాటరాక్ట్) ఆపరేషన్ అవస రమైన 25 మందిని గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేసేందుకు శంకర కంటి ఆస్పత్రికి తరలించినట్లు తాళ్లూరు పిహెచ్సి వైద్యాధికారి పి.ప్రవీణ్ కుమార్, తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కంటి సమస్యలు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలు
ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతంలో కంటి ఆపరేషన్లు చేయించు కున్న వారిలో దగ్గర చూపు సమస్యతో బాధపడుతున్న 15 మందిని గుర్తించి వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశామన్నారు. వైద్యులు సి.రాజేష్ కుమార్
హెల్త్ సూపర్ వైజర్ వీ రవి, పీహెచ్సీ సిబ్బంది, ఏఎన్ఎంలు,ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
