విబిజి రామ్ జీ పథకంలో నూతన విధి విధానాలపై అవగాహన పెంచుకుని గ్రామప్రజలకు వివరించాలని ఇన్చార్జి ఎంపీడీఓ వి శ్రీనివాస రావు అన్నారు. తాళ్లూరులో మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో గురువారం గ్రామ ప్రత్యేక అధికారులకు, ఎంపీటీసీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు విబిజి రామ్ జి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి రోజుల సంఖ్య వంద రోజుల నుండి 125 రోజులకు పెంచటం, 15 రోజుల లోపు ఉపాధి వేతనాలు చెల్లించకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వటం, గ్రామ పంచాయితీ పరిధిలోని 318 పనులకు పంచాయితీ ప్లానింగ్ వంటి నూతన విధి విధానాలపై అవగాహన కల్పించారు. పంచాయితీ పరిధిలో అవనమైన పనులు క్రమ పద్దతిలో, అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎపీఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ-2 సుధాకర్ రావు, ఎవో ప్రసాద రావు తదితరులు పాల్గొన్నారు.
