హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా తిరంగా సైకిల్ ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ జాతీయ జెండా మనందరి గర్వానికి ప్రతీక అని, దేశ ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. తిరంగా ర్యాలీలో అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాన్ని మరింతగా పెంపొందించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, దేశ సమగ్రత, ఐక్యత, శాంతిభద్రతలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.

ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) యన్.యుగంధర్ బాబు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు టు టౌన్ సీఐ వీర నాయక్ ఒంగోలు రూరల్ సీఐ శేషారిగి రావు, ఒంగోలు ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, ఆర్ఐలు సీతారామిరెడ్డి,సురేష్ బాబు, ఆర్ఎస్ఐలు ఏఆర్ ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *