గతంలో ఎన్నడూ లేని విధంగా నూపర్ ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రత, ఎత్తు గాలులు వీస్తూ లోటు వర్షపాతం నమోదు అయినదని వ్యవసాయధికారి ప్రసాద రావు తెలిపారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం రైతులకు కాపాడేందుకు పంటల భీమా తీసుకు వచ్చిందని, ప్రతి ఒక్కరూ భీమా ను నమోదు చేసుకోవాలని కోరారు. సీ ఎస్ కి కేంద్రాలలో, మీ సేవా కేంద్రాలలో పంట భీమా నమోదు చేయించుకోవాలని, వాతావరణ పరిస్థితులను ఎదుర్కోనేందుకు భీమా చేయూతగా ఉంటుందని చెప్పారు.
