ప్రముఖ ఎరువుల సంస్థ ‘పరదీప్ ఫాస్ఫేట్స్’ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు– పి. నాయుడుపాలెంలో ‘జై జవాన్ – జై కిసాన్’ సదస్సు, మాజీ సైనికులకు సన్మానం

చీమకుర్తి, ఆగస్టు 15:
ప్రముఖ ఎరువుల సంస్థ పరదీప్ ఫాస్ఫేట్స్ లిమిటెడ్ (PPL – Adventz) ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పి. నాయుడుపాలెం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జై జవాన్ – జై కిసాన్’ పేరిట నిర్వహించిన ప్రత్యేక రైతు అవగాహన సదస్సుకు సుమారు 90 మంది రైతులు హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా మొదట జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశాభివృద్ధిలో సైనికులు మరియు రైతులు పోషిస్తున్న కీలక పాత్రను కొనియాడారు. అనంతరం మాజీ ఆర్మీ మేజర్ ఎస్. సుబ్బనాచారి, మాజీ సైనికుడు డి. హనుమంతరావు, BSF సైనికులను ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. పర్యావరణ పరిరక్షణ కోసం స్థానిక జెడ్పీ హైస్కూల్ మరియు రైతు భరోసా కేంద్రం ప్రాంగణాల్లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా PPL ప్రతినిధులు మాట్లాడుతూ… రైతులు భూసార పరీక్షలకు అనుగుణంగా సమతుల్య ఎరువులను వినియోగించి నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. PM PRANAM కార్యక్రమానికి అనుగుణంగా సేంద్రీయ, నానో ఎరువుల వాడకంపై రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. సంస్థ ఉత్పత్తులైన Nano Shakthi Nano DAP, Nano Urea, TSP, 20-20-0-13, Smart Solution, Bio-20, Zypmite Plus వినియోగం మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు సమగ్రంగా వివరించారు. రైతుల అభ్యున్నతికి తమ సంస్థ నిరంతరం తోడ్పాటునందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ వేడుకల్లో PPL/Adventz అధికారులు ఎం. హరికిషన్, గోపీకృష్ణ, హరికృష్ణ, రామకృష్ణ, వెంకట్రావుతో పాటు జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఎస్.కె. కయ్యూంబాషా, మాజీ గ్రామా సర్పంచ్ కె. రాఘవరెడ్డి, ఎల్. రమణారెడ్డి మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *