హైదరాబాద్ ఆగస్టు 15,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమర యోధులకు నివాళులు అర్పించారు.నాటి స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.ఈ కార్యక్రమంలో సభ్యులు చిట్యాల శ్వేత, సదా లక్ష్మి , రాదా భాయి , ఉజ్మా ఆషయ్ షాకీర్ ,కార్యదర్శి పద్మజ రమణ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
