ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. ఈనెల 23వ తేదీన పంతులు గారి జయంతి నేపథ్యంలో వేడుకల నిర్వహణపై సోమవారం గ్రీవెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రకాశం భవనంలోనూ, వినోద రాయునిపాలెం, దేవరంపాడులో కూడా ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ఆహ్వాన పత్రాల అందజేత, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ప్రోటోకాల్ విషయాలలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ పివి రమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ అనుపమ, డీఈవో సివి రేణుక, డి.ఆర్.డి.ఏ. పిడి నారాయణ, డ్వామా పిడి జోసఫ్ కుమార్, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. అశోక్, జిల్లా బిసి సక్షేమ అధికారి నిర్మల జ్యోతి, ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
