దర్శి తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఈఆర్ఓ ఎ. శాంతిలక్ష్మి ఆధ్వర్యంలో సార్ ప్రక్రియపై రివ్యూ సమావేశం జరిగింది.
సర్ లో భాగంగా అనామలిస్ మరియు నో మ్యాపింగ్ ఉన్న ఓటర్లకు నోటీసులు అందజేశామని ఈఆర్ ఓ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు కేటాయించిన తేదీలోపు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.
22, 23 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్….
ఆగస్టు 22 మరియు 23 తేదీల్లో రెండు రోజులు స్పెషల్ క్యాంపెయినింగ్ డేస్ నిర్వహించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని 291 బూత్ లెవెల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన బూతుల వద్ద డ్రాఫ్ట్ జాబితా మరియు ASD జాబితాలతో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆ రెండు రోజుల్లో నోటీసులు అందుకున్న వారు బూతుల వద్దకు వచ్చి వివరాలు సరిచూసుకోవచ్చని సూచించారు.
దర్శి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వేప్ అవగాహన సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ఫారం-6 ను తగిన ఆధారాలతో సమర్పించాలని ఈ ఆర్ఓ కోరారు.
తూర్పు చౌటపాలెం బూత్ నెం. 166 వద్ద హియరింగ్‌కు సంబంధించి నోటీసులు పొందిన వారు హాజరవగా వారి వివరాలను ఈఆర్ఓ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బి.వి. రమణారావు ఎంఈఓ బి. రమాదేవి ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ టి. దేవ ప్రసాద్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస ప్రసాద్ ఆపరేటర్లు సురేష్, అఫ్రోజ్ పాల్గొన్నారు.
