ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34శాతం రిజర్వేషన్ కల్పించటంతో తాళ్లూరుబీసీ నాయకులు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. బీసీల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వక్తలు కొనియాడారు. బీసీలకు రిజర్వేసన్ పెంచటంపై హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. రాబోవు ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధుల విజయానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ నాయకులు ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, మండల టిడిపి అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, బీసీ సెల్ నేత పిన్నిక రమేష్, పాశం నూరిబాబు, రాష్ట్ర నాటక అకాడమి డైరెక్టర్ ఓబులు రెడ్ది, మానం రమేష్ బాబు, నీటి సంఘ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, ఇడమకంటి సుబ్బా రెడ్డి, వెలుగు నుబ్బారావు, నవులూరి విద్యా సాగర్, కైపు రామ కోటి రెడ్డి, నాగార్జున రెడ్డి, జి వేణు బాబు, మాజీ సర్పంచి నాగేశ్వర రావు, ఆవుల ఆదినారాయణ, వంగపల్లి నాగేశ్వర రావు, చాట్ల డానీ, నాదేండ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. బీసీలకు నముచిత స్థానం కల్పించటంతో టిడిపి మొదటి నుండి ముందజలో ఉన్నదని వక్తలు కొనియాడారు.
