రెవెన్యూ అధికారి, సర్వేయర్ మరియు వీఆర్వోలు కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రి సర్వే సంబంధిత విషయాలను పరిష్కరించాలని సీసీఎల్ఏ( చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్) మరియు స్పెషల్ సి.యస్ టూ గవర్నమెంట్ జయలక్ష్మి ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, మరియు సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా భూముల రీ- సర్వే, పట్టాదారుపాస పుస్తకాలు, పి జి ఆర్ ఎస్, ఐ వి ఆర్ ఎస్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కనీసం రోజుకి మూడు గంటలైనా రి సర్వే పై దృష్టి సారించాలన్నారు.444 మరియు 445 జీవోలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వం తీసుకొస్తున్న జీవోలపై మరియు సర్కులర్లపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు. జీవోలకు సంబంధించి మరియు సర్కులర్లకు సంబంధించి ఒక బౌండు బుక్కును ఏర్పాటు చేసుకొని విధిగా తమ వద్ద ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. భూములు రిసర్వే ప్రక్రియలో కొత్త కొత్త నిబంధనలు జోడించడం జరిగిందని వాటిని అనువదించుకొని పనులు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఏమైనా ఉంటే సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారి లేదా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని ఆమె తెలిపారు. పి జి ఆర్ ఎస్ లో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని విధిగా అర్జీదారునితో చర్చించి వారి సంతృప్తి స్థాయిని పెంచాలని ఆమె అన్నారు. అర్జీ దారునితో కనీసం రెండుసార్లైనా మాట్లాడవలసి ఉంటుందన్నారు. ఎమ్మార్వోలు, ఆర్డీవోలు అర్జీదారులతో మాట్లాడవలసి ఉంటుందన్నారు. జిల్లాలో పి జి ఆర్ ఎస్ సక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు దీనిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. మండల రెవెన్యూ అధికారుల చేత పలు ప్రశ్నలు సంధించి వారి నుండి జవాబులు రాబట్టారు. ప్రతి పిటిషన్ మీద ప్రత్యేక దృష్టి కనపరిచి సకాలంలో పరిష్కరించాలన్నారు. ఆర్ ఓ ఆర్ సర్వీస్ మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని ఆమె కోరారు. మండల రెవెన్యూ అధికారులు వారి వారి లాగిన్సులలో ఎక్కువ రోజులు పిటిషన్లు ఉంచుకోకూడదని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రోనంకి కూర్మనాద్, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, రెవెన్యూ డివిజనల్ అధికారులు మండల రెవెన్యూ అధికారులు మరియు సర్వేయర్లు పాల్గొన్నారు .


