తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తి విద్యుత్ షాక్ తో మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన గోళ్ల పాటి ఫిలిఫ్ (44) అదే గ్రామానికి చెందిన మరోకరి ఇంటికి విద్యుత్ రాక పోతుండటంతో పరిశీలించటానికి వెళ్లారు. తీగను పరిశీలించు క్రమంలో విద్యుత్ ప్రసరణ జరిగి వ్యక్తి పడిపోయాడు. తక్షణమే తాళ్లూరు పీహెచ్సీకి తరలించగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య, ఇరువురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఫిలిఫ్ మృతితో కాలనీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
