హైదరాబాద్ ఆగస్ట్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ని మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సి ఎం కు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కి భగవంతుడు ఆయురారోగ్యాలను, మరిన్నివిజయాలను చేకూర్చాలని
ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆకాంక్షించారు.

