హైదరాబాద్ ఆగస్ట్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో శుక్రవారం నిర్వహించిన 251
వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 42 దరఖాస్తులు అందాయి.వాటిలో రెవెన్యూ శాఖకు 11, మున్సిపల్ శాఖకు 13, విద్యుత్ శాఖకు 05, ఇతర శాఖలకు 13 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ దరఖాస్తులు స్వీకరించి ఎండార్స్మెంట్ చేసి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించారు.
రాఖీ పండుగ నేపథ్యంలో సీఎం ప్రజావాణికి దరఖాస్తుదారుల రద్దీ తగ్గింది. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏసిపి ఉమేందర్, ఎన్.ఆర్.ఐ. సలహా మండలిసమన్వయకర్త బొజ్జఅమరేందర్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
