వెన్నెముక సమస్యతో బాధ పడుతున్న మహిళకు రూ. 5 లక్షల ఎల్.ఓ.సీ.సీఎం లేఖను పేషంట్ కుమారునికి అందజేసిన చిన్నారెడ్డి.

హైదరాబాద్ ఆగస్ట్ 28,(జే ఎస్ డి ఎం న్యూస్) :
తీవ్రమైన వెన్నెముక సమస్యతోబాధపడుతూ నిమ్స్ లో చేరిన మహిళ చికిత్స కోసం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రూ. ఐదు (5) లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్ ఓ సి) ని పేషంట్ పద్మమ్మ కుమారుడు రాజశేఖర్ రెడ్డికి సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అందజేశారు.శుక్రవారం మహాత్మా
జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో జరిగిన 251 సీఎంప్రజావాణి కార్యక్రమానికి నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెద్రి పాడ్ గ్రామానికి చెందిన అన్నసారం పద్మమ్మ కుమారుడు రాజశేఖర్ రెడ్డి వచ్చి చిన్నారెడ్డికిసమస్యను వివరించి ఎల్ఓసిఇప్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. నిమ్స్ వైద్యులు ఇచ్చిన ఎస్టిమేషన్, రోగ వివరాలు అన్నీ కలిపి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపగా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తూ లెటర్ అఫ్ క్రెడిట్ ఇస్తూ సీఎం కార్యాలయం లేఖను నిమ్స్ డైరెక్టర్ కు డబ్బులు లేకుండా చికిత్స చేయాలని ఆదేశించారు. చికిత్స తర్వాత బిల్లులు సీఎం కార్యాలయానికి పంపాలని సూచించారు. ఇదంతా కొన్ని గంటల్లోనే చక చక జరిగిపోయింది. తమ సమస్యపై వెంటనే స్పందించి ఎల్ఓసి మంజూరు చేయించిన సి.ఎం.రేవంత్ రెడ్డి ,చిన్నారెడ్డికి పద్మమ్మ కుటుంబం ధన్యవాదాలు తెలిపింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *