తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రకృతి వ్యవసాయమే నరియైన మార్గమని ప్రకృతి వ్యవసాయం జిల్లా మెనేజర్ సుభాషిణి అన్నారు. రైతు సాధికార సంస్థ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ఆధ్వర్యంలో రెండు రోజుల బయో ఇన్పుట్ సెంటర్ పాయింట్ పర్సన్ల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. బి ఆర్ సీ సెంటర్ల ముఖ్య ఉద్దేశ్యం గురించి వివరించారు. రైతుల సాగులో ఎదుర్కోనే పురుగులు, తెగుళ్ల నివారణకు అవసరమైన ప్రకృతి వ్యవసాయ ద్రావణాలను బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచటం జరుగుతుందని తెలిపారు. ద్రావణాలను నరైన పద్దతిలో 3 వినియోగించటం ద్వారా తక్కువ పెట్టుబడితో పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధించటంతో పాటు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో ప్రకృతి సిబ్బంది నరసింహాలు, మాధవి, వెంకట రావు, విజయలక్ష్మి, రాధా, రంజిత్, మాధురి, దేవ సేన తదితరులు పాల్గొన్నారు.

