విద్యాశాఖా మంత్రి లోకేషన్ ఒంగోలు పర్యటనలో బాగంగా తాళ్లూరుకు చెందిన పలువురు యువ నాయకులు మంత్రి లోకేష్ ను ప్రత్యేకంగా కలిసారు. కొర్రపాటి వారి పాలెంకు చెందిన రాష్ట్ర యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, విఠలాపురం కు చెందిన దర్శి నియోజక వర్గ సోషల్ మీడియా వింగ్ బాధ్యుడు నవులూరి విద్యాసాగర్ లు లోకేష్ ను ప్రత్యేకంగా కలిసారు. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితి , రాబోవు స్థానిక ఎన్నికలలో అనుచరించాల్సిన వ్యూహం గురించి, స్థానికంగా ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ లు పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషిని వివరించారు.

