బేగంపేట ఆగస్ట్ 29(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఇందిరాగాంధీ పురంలో రోడ్డు ఆక్రమణలను శనివారం తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు ఆధ్వర్యంలో తొలగించారు. రోడ్లను ఆక్రమిస్తూ వాహనాలు పార్కింగ్ చేయడం కొందరు స్థానికులు రోడ్లపైనే భవన నిర్మాణాల మెటీరియల్ తో పాటు ఇతరత్రా వేయడంతో ఆవైపు వాహనదారుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఏసిపి ట్రాఫిక్ సిబ్బంది, క్రేన్ తో పాటు ఆ ప్రాంతానికి చేరుకొని రోడ్డుపై అడ్డంగా పార్కింగ్ చేసిన వాహనాలను తొలగింపజేశారు. కొందరు కట్టెలు, ఇతరత్రా భవన నిర్మాణాల సామాగ్రి వేయడం గమనించి వాటిని అక్కడి నుంచితొలగింపజేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏ సి పి జీ.శంకర్ రాజు మాట్లాడుతూ రోడ్లను బ్లాక్ చేస్తూ వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై వాహనాలను అడ్డంగా పార్కింగ్ చేయవద్దని, ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, ఆయన హెచ్చరించారు. మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి నేతృత్వంలో ట్రాఫిక్ కి ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయత్నిస్తున్నామని, ఆయన తెలియజేశారు. ఇందిరా గాంధీపురం వద్ద ఒకవైపు రోడ్డును ఆక్రమించి పార్కింగ్ చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో ఆ ప్రాంతాన్ని సందర్శించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు.ఈ మార్గంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తామని, ఎవరైనా రోడ్డు ఆక్రమించి పార్కింగ్ చేసినా,బిల్డింగ్ మెటీరియల్ వంటివి వేసి జామ్ చేసిన అలాంటి వారిపై చర్యలు తప్పవు అని ఎసిపి హెచ్చరించారు. ఏ సి పీ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది వున్నారు.

