హైదరాబాద్ ఆగస్ట్ 29,(జే ఎస్ డి ఎం న్యూస్)
నగరంలో ఆదివారం తెల్లవారుజామున నిర్వహించనున్న హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్ సందర్భంగా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ఉదయం 4:30 గంటల నుండి 9:30 గంటల వరకు పలు కీలక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ మారథాన్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ఎన్‌టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, సెయిలింగ్ క్లబ్, బుద్ధ భవన్, సంజీవయ్య పార్క్, పీపుల్స్ ప్లాజా, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్, ఎంజే కాలేజ్, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నంబర్ 45 మరియు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వరకు కొనసాగనుంది.
ట్రాఫిక్ మళ్లింపుల వివరాల్లోకి వెళ్తే, మినిస్టర్స్ రోడ్, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు అనుమతించకుండా నల్లగుట్ట జంక్షన్ వద్ద రాణిగంజ్, మినిస్టర్స్ రోడ్ వైపు మళ్లిస్తారు. పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదాన్, నిరంకారీ భవన్ మీదుగా రవీంద్ర భారతి వైపు పంపిస్తారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, షాదాన్ నుండి బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ వెళ్లేవారు కేసీపీ, తాజ్ కృష్ణా, రోడ్ నంబర్ 10 & 12, క్యాన్సర్ హాస్పిటల్, ఒరిస్సా ఐలాండ్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ ప్రారంభ పాయింట్ వద్ద పైకి మళ్లిస్తారు. లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ తల్లి, ఇక్బాల్ మినార్ యూ-టర్న్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ద్వారా లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ గుడి వైపు అనుమతిస్తారు. కర్బాలా వైపు నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలు చిల్డ్రన్స్ పార్క్ వద్ద డీబీఆర్ మీదుగా కవాడిగూడ వైపు వెళ్లాలి. ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుండి సెయిలింగ్ క్లబ్ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ ఎక్స్ రోడ్ వద్ద డీబీఆర్ మిల్స్, లోయర్ ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తారు. అలాగే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్ బండ్ వైపు అనుమతించకుండా, డీబీఆర్ మిల్స్ వద్ద కవాడిగూడ ఎక్స్ రోడ్, గోశాల మీదుగా జబ్బార్ కాంప్లెక్స్ వైపు పంపుతారు.
పరుగు నెక్లెస్ రోటరీకి చేరుకున్న సమయంలో బేగంపేట నుంచి రాజ్ భవన్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనాలను గ్రీన్‌లాండ్స్ వద్ద డీకే రోడ్, అమీర్‌పేట్ వైపు మళ్లిస్తారు. బంజారాహిల్స్ వెళ్లేవారు డీకే రోడ్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎన్‌ఎఫ్‌సీఎల్, తాజ్ కృష్ణా మీదుగాను; జూబ్లీహిల్స్ వెళ్లేవారు మైత్రివనం, యూసుఫ్‌గూడ, వెంకటగిరి, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో ప్రయాణించవచ్చు. మారథాన్ పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కినప్పుడు పంజాగుట్ట నుండి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్ వద్ద రోడ్ నంబర్ 1 వైపు మళ్లిస్తారు.
రన్నర్లు సాగర్ సొసైటీ జంక్షన్‌కు చేరుకున్నప్పుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను రోడ్ నంబర్ 2 వైపు అనుమతించకుండా, ఎన్‌టీఆర్ భవన్ వద్ద కుడివైపు క్యాన్సర్ హాస్పిటల్, జహీరా నగర్, రోడ్ నంబర్ 10 మీదుగా పంపిస్తారు. పరుగు ఎన్‌టీఆర్ భవన్ చేరుకున్నప్పుడు ఫిల్మ్ నగర్, బీవీబీ జంక్షన్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వచ్చే వాహనాలను జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నంబర్ 70 వద్ద హార్ట్ కప్ జంక్షన్, రోడ్ నంబర్ 54 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు మళ్లిస్తారు. ఇక సైబరాబాద్ కేబుల్ బ్రిడ్జి నుండి వచ్చే వాహనాలను రోడ్ నంబర్ 45 వైపు అనుమతించకుండా ర్యాంప్ ద్వారా మెగ్నోలియా బేకరీ జంక్షన్, రోడ్ నంబర్ 39 మీదుగా రోడ్ నంబర్ 36 వైపు మళ్లిస్తారు. ఆదివారం ఉదయం ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఏదైనా అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయవచ్చని అధికారులు కోరారు.
