బేగంపేట ఆగస్ట్ 29(జే ఎస్ డి ఎం న్యూస్) : లీడర్లు క్యాడర్ ను కలుపుకొని ముందుకు సాగాలనీ, గ్రేటర్ ఎన్నికల నాటికి కూకట్ పల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో కాంగ్రెస్ మరింత పటిష్టంగా తయారు కావాలి అని కూకట్పల్లి నియోజకవర్గం ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. శనివారం అల్లం తోట బాయిలో ప్రకాశనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ప్రకాశం నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్గా కరుణాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో
బండి రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజాపాలన సాగిస్తుందని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేతలు కార్యకర్తలు సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్లి వివరించాలని సూచించారు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలతో పాటు నేతలు కూడా తీసుకోవాలని కోరారు సీనియర్ల సలహాలు సూచనలు తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.మహిళా, ఎస్సీ ,ఎస్టీ ,బి సి మైనార్టీ ,యువజన ,,సోషల్ మీడియా విభాగాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

