వైభవంగా నరస్వతి దేవి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం

తాళ్లూరు లోని శ్రీ వూటుకూరి కోటయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల లో శనివారం నరస్వతిదేవి విగ్రహ ప్రతిష్టా మహోూత్సవం ఘనంగా నిర్వహించారు. విగ్రహ దాతలు ప్రిన్సిపాల్, డీఐ ఈ ఓ, ఆరఓ కొండపల్లి ఆంజనేయులు, మహేశ్వరి, ల్యాబ్ అసిస్టెంట్ నూది సుబ్బరామయ్య, పద్మజ దంపతుల సహకారంతో కళాశాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. అనంతరం వేదపండితులు శాస్త్రి పంతులు గారి ఆధ్వర్యంలో వేద మత్రోచ్ఛారణ మధ్య పలు పూజలు నిర్వహించారు. అన్నదానం చేసారు. ఆరఓ రాజేంద్ర, లెక్చరర్స్ వేణుగోపాల్ లక్ష్మయ్య, రాజశేఖర్, గురవయ్య, సాయి లక్ష్మి దేవి, వెంకటేశ్వర్లు, లలితా బోన్, శంకరమ్మ, నాన్ టీచింగ్ స్టాఫ్ శేషగిరి, బ్రహ్మా రెడ్డి, శ్యామ్సన్, జయపాల్ లు విగ్రహా దాతలు ప్రిన్సిపాల్ కొండ పల్లి ఆంజనేయులు, ల్యాబ్ అసిస్టెంట్ నూది సుబ్బరామయ్య దంపతులను ఘనంగా సన్మానించారు. కళాశాల అభివృద్ధికి సహకరించిన స్థానికులకు, నాయకులకు ప్రిన్సిపల్ కొండపల్లి ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *