గురుకుల టీచర్స్ నాన్ జాయినింగ్ ఖాళీల్లో తదుపరి మెరిట్ అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాలి ….సీఎం ప్రజావాణికి భారీగా తరలివచ్చిన నిరుద్యోగ అభ్యర్థులుసీఎం ప్రజావాణిలో 152 దరఖాస్తులు

బేగంపేట సెప్టెంబర్ 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
గురుకుల టీచర్స్ పోస్టులకు ఎంపికై జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన తరువాత ఏర్పడిన నాన్ జాయినింగ్ ఖాళీల్లో తదుపరి మెరిట్ కలిగిన అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తునమంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణికి తరలివచ్చారు.మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించిన 252వ సీఎం ప్రజావాణి కార్యక్రమానికి గురుకుల టీచర్స్ పోస్టులకు పరీక్షలు రాసిన మెరిట్ నిరుద్యోగ అభ్యర్థులు తమ సమస్యలు తెలిపారు.వారి సమస్యలను విన్న సీఎం ప్రజావాణి స్టేట్ ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి నిరుద్యోగ అభ్యర్థుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 152 దరఖాస్తులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖకు 66 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు 19 దరఖాస్తులు, హోం శాఖకు 15, ఇతర శాఖలకు 52 దరఖాస్తులు వచ్చాయి. సోషల్ వెల్ఫేర్ శాఖకు ఒక గ్రూప్ ద్వారా 102 మంది, విద్యా శాఖకు ఒక గ్రూప్ ద్వారా ముగ్గురు, కార్మిక శాఖకు ఒక గ్రూప్ ద్వారా 13 మంది సభ్యులు సీఎం ప్రజావాణికి వచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎసిపి ఉమేందర్, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జ అమరేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *