హైదరాబాద్, సెప్టెంబర్ 1,(జే ఎస్ డి ఎం న్యూస్) :
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, దిగ్గజ ఒలింపిక్ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని స్మరించుకుంటూ, తెలంగాణ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ప్రెస్ క్లబ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ యువ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు క్రీడారంగంలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు.
క్రీడల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంఅందిస్తున్న సహాయ
సహకారాలు, క్రీడా వసతులు, మౌలిక సదుపాయాలను మరింతగాఅభివృద్ధి చేయాల్సినఅవసరం ఉందని
పేర్కొన్నారు.క్రీడలు ఆడటం వల్ల వ్యక్తుల్లో మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటానికి వీలవుతుందని ముఖ్య వక్తలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. పుంజాల సుప్రియ, బేగంపేట్,హైదరాబాద్‌లోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మేజర్ ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డు–2026 ప్రదానం చేశారు.
డా. ఎ. సిద్ధార్థ, డా. ఆర్. మురళి, మేజర్ డి. జయసుధ, మేజర్ కె.వి.
శివప్రసాద్, పోతుల శ్రీనివాస్ యాదవ్ తదితరులకు అవార్డులు అందజేశారు.తెలంగాణ గురుకుల పాఠశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాధుల మధుసూదన్, జంట నగరాల శ్రీ గజరాజు బ్రహ్మ సమాజ్ అధ్యక్షుడు తరుణ్ కుమార్ మొహతా, తెలంగాణ మేధావుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డా. రాజ్ నారాయణ్ ముదిరాజ్, కార్యదర్శి డా. మహమ్మద్ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

