తప్పిపోయిన వృద్ధులను కుటుంబ సభ్యులకు అప్పగించిన చిలకలగూడ పోలీసులు.చిలకల గూడ

సెప్టెంబర్ 1 (జే ఎస్ డి ఎం న్యూస్) :
తప్పిపోయిఆశ్రయంపొందుతున్న ఇద్దరు మహిళల ఆచూకీ కనుగొని, వారిని కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడంలో చిలకలగూడ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆగస్టు 31న చిలకలగూడ పరిధిలో కనిపించిన బాలమణి, గోవిందమ్మలను పోలీసులు తొలుత డ్రీమ్ ఇండియా హోమ్‌లోచేర్పించారు.అనంతరం వారి వివరాలు, ఫోటోల ఆధారంగాపోలీసులు పరిసర
ప్రాంతాల్లో విస్తృతంగా విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో సమాచారం అందుకున్న గోవిందమ్మ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తగిన వివరాలు అందించి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మరోవైపువికారాబాద్‌కు చెందిన బాలమణి ఫోటోను పత్రికల్లో చూసిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే చిలకలగూడ పోలీస్ స్టేషన్‌నుఆశ్రయించారు. వారి గుర్తింపును ధృవీకరించుకున్న పోలీసులు డ్రీమ్ ఇండియా హోమ్ నుంచి బాలమణిని తీసుకొచ్చిబంధువులకు అప్పగించారు.
ఇన్‌స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ ఆదేశాల మేరకు హెడ్
కానిస్టేబుల్ పూస శ్రీనివాస్ చొరవ తీసుకుని ఇద్దరు మహిళలను వారి కుటుంబాల వద్దకు క్షేమంగా చేర్చారు. తమ వారిని
సురక్షితంగా అప్పగించినందుకు బాధితుల కుటుంబ సభ్యులుచిలకలగూడ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *