నూరు శాతం అక్షరాస్యత సాధనకు కృషి చేయాలి… వయోజన విద్య ఉప సంచాలకులు జగన్మోహన్ రావు

తాళ్లూరు : రాష్ట్రంలో అమలవుతున్న అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నూరు శాతం అక్షరాస్యత సాధనకు అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని వయోజన జిల్లా విద్య ఉప సంచాలకులు బి. జగన్ మోహన్ రావు కోరారు.
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అక్షరాస్యత పక్షోత్సవాల్లో భాగంగా తాళ్లూరు వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాయని చెప్పారు.
సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి ఏపిఎమ్ దేవరాజు అధ్యక్షత వహించారు.

మండల పరిధిలో 6885 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సర్వే ద్వారా గుర్తించారని వయోజన విద్య పర్యవేక్షకులు వై చౌడిరెడ్డి చెప్పారు. వారిలో సగం 3450 మందిని రెండో విడతలో అక్షరాస్యులుగా మార్చేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు అందరూ సమన్వయంతో పనిచేయాలని విఓఏ లకు సూచించారు.
టార్గెట్ గా నిర్ణయించబడిన వారందర్ని సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ల లాగిన్ ద్వారా అక్షరాంధ్ర యాప్ నందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని ఏపిఓ సురేఖ వివరించారు . ఎంపిక చేసిన వాలంటరీ టీచర్లతో సెప్టెంబర్ 8 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించాలని.. పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్ లు అందించడంతో పాటు వీడియో పాఠాల ద్వారా వంద గంటల పాటు శిక్షణ ఇస్తారని వివరించారు.
వెలుగు సిసిలు మోహన్ రావు, కోటేశ్వరరావు, వివిధ గ్రామాలకు చెందిన విఓఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *