బేగంపేట సెప్టెంబర్ 5,(జే ఎస్ డి ఎం న్యూస్) :
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బ్రావూ) ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, పీజీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పద్మావతి తెలిపారు. దూరవిద్య ద్వారా ఉన్నత విద్యనుఅభ్యసించాలనుకునే మహిళా విద్యార్థినులకు ఇదొక చక్కటి అవకాశమని పేర్కొన్నారు.ఈ విద్యా కేంద్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులతో పాటు ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ ప్రోగ్రామ్లు కేవలం మహిళలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు.ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు, ఓపెన్ ఇంటర్, మూడేళ్లపాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు.
అలాగే గత విద్యా సంవత్సరాల్లో అడ్మిషన్ పొందిన 2వ, 3వ సంవత్సరం విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును చెల్లించవచ్చని, గతంలో సకాలంలో ఫీజు చెల్లించలేకపోయిన వారు కూడా ఇప్పుడు బకాయిలను చెల్లించే అవకాశం కల్పించినట్లు స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2026 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ను సంప్రదించాలని కోరారు.
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మావతి.
05
Sep