పెట్ బషీరాబాద్ సెప్టెంబర్ 5, (జె ఎస్ డి ఎం న్యూస్)
ప్రతి మనిషి వృద్ధిలోకి రావడానికి గురువు ఎంతో ముఖ్యం. అని కుత్బుల్లా పూర్ డి సి పి ఎన్.కోటిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా
డిజిపి సి.వి.ఆనంద్ , సైబరాబాద్ కమిషనరేట్ సి పి ఆదేశాల ప్రకారం శనివారం కుత్బుల్లాపూర్ డిసిపి ఎన్ కోటిరెడ్డి జీడిమెట్ల జడ్.పి.హెచ్.ఎస్ గవర్నమెంట్ స్కూల్ ని సందర్శించి అక్కడ ఉన్న టీచర్స్ అందరిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన గతంలో తాను కూడా ఉపాధ్యాయ వృత్తి వృత్తిలో కొనసాగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రతి మనిషి వృద్ధిలోకి రావాలంటే గురువు ఎంతో ముఖ్యమని చెబుతూ గురువు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ కే. విజయ వర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు.
