రామ్ గోపాల్ పేట సెప్టెంబర్ 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాంగోపాల్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ తండ్రి పండరి ముదిరాజ్ సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ వారి నివాసానికి వెళ్లి పండరి ముదిరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు.అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. పండరి ముదిరాజ్ మృతి వారి కుటుంబ సభ్యులతో పాటు తనను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ
వారి బాధలో తాను పాలుపంచుకుంటానన్నారు . వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. అనంతరం పండరి ముదిరాజ్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పండరి ముదిరాజ్ మృతికి సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.

