క్షేత్రస్థాయిలో అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా అధికారులు పనిచెయ్యాలని జిల్లా ముస్లీం మైనార్టీ ఈడీ, మండల ప్రత్యేక అధికారి ఫైజుద్దీన్ అన్నారు. తాళ్లూరు స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద సోమవారం మీకోసం – పీజీఆర్ఎన్ కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. మండల ప్రత్యేక అధికారి ఫైజుద్దీన్ మాట్లాడుతూ గ్రామ స్ధాయిలో ప్రతి సోమవారం పీజీఆర్ ఎస్ నిర్వహించి క్షేత్ర స్థాయిలోనే పరిష్కారాన్ని సూచించనున్నట్లు చెప్పారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి లు మాట్లాడుతూ పలు గ్రామాలలో నీటి సమస్య వస్తుందని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను సంతృప్త స్థాయిలో పనులు చేస్తే అధికారులకు మంచి పేరు వస్తుందని చెప్పారు. నూతన పెన్షన్ల కొరకు 25, హౌసింగ్ నిమిత్తం 3, భూ సమస్యలపై ఐదు వినతులు వచ్చినట్లు ఎంపీడీఓ అజిత తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ ఫణీంధ్ర, ఎంఈఓ జి సుబ్బయ్య, ఎవో ప్రసాద రావు, వివిధ ఎఈలు రామక్రిష్ణ , సుబ్బా రావు, వాలి, హనుమంత రావు, వైద్యులు రాజేష్ యాదవ్, ఎపీఓ దేవరాజ్, ఎపీఓ వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శి వెంకటాద్రి, కరువది మేజర్ ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, ఇడమకంటి సుబ్బా రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


