పాగాకు బోర్డు అనుమతి మేరకు మాత్రమే పొగాకు రైతులు పొగాకు ను సాగు చేసుకోవాలని ఒంగోలు – 2 వేలం నిర్వాహణాధికారి తులసి అన్నారు. వేలం కేంద్రం పరధిలోని టి అగ్రహారం గ్రామంలో సోమవారం పొగాకు రైతులకు పంట సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ వ్వాప్తంగా పొగాకు సాగు వ్యాప్తి పెరుగుతుందని దీనివలన మన పొగాకుకు డిమాండ్ తగ్గుతుందని చెప్పారు. బ్యారన్ కి ఒక హెక్టార్, రెండు వేల కేజీల పరిమాణం మాత్రమే సాగు చేసుకోవాలని కోరారు. నారు కొనే ముందు రసీదు తీసుకోవాలి, ఫామ్ – 2 ఇచ్చే ముందు బోర్డుకు సమర్పించాలని చెప్పారు. భూమిలో సేంద్రీయ కర్బనం ఉ త్పత్తి అయ్యేలా పశువుల ఎరువు వేసుకోవాలని కోరారు. నీటి తడులు ఇవ్వాల్సిన విధానం, యాజమాన్య పద్ధతులను వివరించారు.


